ఇదేందయ్యా ఇది... ఫ్లాట్ బాల్కనీలో టాయిలెట్, నెట్టింట నవ్వులు!

  • బెంగళూరు ఫ్లాట్ బాల్కనీలో ఏర్పాటు చేసిన వెస్టర్న్ టాయిలెట్
  • అద్దె ఇంటి కోసం వెళ్లిన యువతులు తీసిన వీడియో వైరల్
  • సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్లతో నవ్వులు పూయిస్తున్న నెటిజన్లు
  • బెంగళూరు రియల్ ఎస్టేట్ పోకడలపై సెటైర్లకు దారితీసిన ఘటన
బెంగళూరులో అద్దె ఇంటి కోసం వెతుకుతున్న వారికి కొన్నిసార్లు ఊహించని అనుభవాలు ఎదురవుతుంటాయి. తాజాగా ఓ ఫ్లాట్ బాల్కనీలో ఏకంగా వెస్టర్న్ టాయిలెట్‌ను చూసి ఇద్దరు యువతులు షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తూ, నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది.

వివరాల్లోకి వెళితే, త్రిష అనే యువతి తన స్నేహితురాలితో కలిసి బెంగళూరులో అద్దె ఇంటి కోసం వెతుకుతోంది. ఈ క్రమంలో వారు చూసిన ఒక ఫ్లాట్‌లోని బాల్కనీలో ఫ్లష్ ట్యాంక్, జెట్ స్ప్రేతో సహా పూర్తిస్థాయి టాయిలెట్‌ను ఏర్పాటు చేసి ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. చుట్టుపక్కల అపార్ట్‌మెంట్ల నుంచి స్పష్టంగా కనిపించేలా ఉన్న ఈ "ఓపెన్ బాత్రూమ్" వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, అది క్షణాల్లో వైరల్ అయింది. రెడ్డిట్, ఎక్స్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఈ వీడియో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

ఈ వింత టాయిలెట్‌పై నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. "ప్రకృతిని చూస్తూ ప్రకృతి పిలుపు" అని ఒకరంటే, "ఇంటి ఓనర్‌కు ప్రకృతి అంటే ఎంత ప్రేమో" అని మరొకరు సెటైర్ వేశారు. "గాలి, వెలుతురుకు లోటుండదు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ అవసరమే లేదు" అని కొందరు చమత్కరించారు. బెంగళూరులో అధిక అద్దెలు, ఇరుకు గదుల గురించి తరచూ వచ్చే మీమ్స్‌కు ఇది కొత్త ఆజ్యం పోసిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. 

Bengaluru
Balcony Toilet
Viral Video
Bengaluru House Hunting
Social Media Reactions
Weird Apartment Designs

More Telugu News